Address

Kusuma Jayabheri Editorial Office, Hyderabad, Telangana, India – 500072

Phone

+91 99892 41319

Email

info@kusumajayabheri.com

గెట్ ఇన్ టచ్ 

చారిత్రక స్థానం: 20వ శతాబ్దం తొలి దశల్లో తెలుగు ప్రాంతాల్లో దళిత సాహిత్య ఉద్యమానికి జయభేరి పత్రిక ఒక మైలురాయిగా నిలిచింది.

ప్రశ్నలు 

తరచూ అడిగే ప్రశ్నలు

 Dr రాధా కుసుమ, ప్రఖ్యాత కవయిత్రి, ప్రభుత్వ ఉపాద్యాయరాలిగా పదవీ
విరమణ చేసిన పిమ్మట సాహితీ రంగానికి, కళా రంగానికి సేవ చేయు ధ్యేయంతో ఈ పత్రిక
స్థాపించబడినది.

 కుసుమ ధర్మన్న గారు భారత స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. ఆయన మహాత్మా గాంధీ గారితో, Dr BR అంబెడ్కర్ గారితో మరియు ఇతర స్వాతంత్ర యోధులతో అలనాడు పోరాటంలో తనదైన శైలిలో, కవితాత్మకంగా మరియు సాహిత్య పరంగా, దళిత వర్గాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. అలనాడు, దళిత వర్గాలను అంటరాని వారిగా, మరియు దైవ ప్రార్ధన మందిరములలో వెళ్లనీయకుండా, మరియు చదువుకోనీయకుండా, మరియు ధనిక, అగ్రకులాల వారికి చాకిరీలు చేసే విధంగా ఉన్నరోజులలోనే జయభేరి అనే పత్రికను స్థాపించి, సామాజిక చైతన్యాన్ని ప్రజలకు కలిగించారు. అలాంటి మహానుభావుడి మనవరాలిగా ఉన్న నేను వారు నిర్వహించిన జయభేరి పత్రిక పేరుతో, ఈ కుసుమ జయభేరి పత్రికను రూపొందించడం జరిగింది. ఈ డిజిటల్ పత్రిక స్థాపించి ప్రజలకు సాహితీ, కళా రంగానికి, సేవ చేయడమే లక్ష్యం.

 కవితలు, వ్యాసాలు, రచయితల పరిచయాలు, మరియు వంటా వార్పులు, మరి ఇతరత్రా
సాహిత్య రాంగానికి సంబందించినవి ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్నాయి. మరియు కవి
సమ్మేళనాలు, జూమ్ మీటింగ్లలో జరిగే కవిత్వ ఉపన్యాసాలు కూడా ఎక్కువ ప్రచారం
మరియు ప్రాధాన్యత గా ఉంటాయి.

కవితలు, వ్యాసాలూ, వంటా వార్పూ, రచయితల పరిచయాలు, కళా రాంగానికి మరియు
కవితా రంగానికి సంబందించినవి, కార్టూన్ లు, పిల్లల డ్రాయింగ్ లు పెయింటింగ్ లు
పంపవచ్చు.

 ఈ పత్రిక www . kusumajayabheri.org లో మరియు గూగుల్ లో మరియి పేస్ బుక్ లో
చూడవచ్చు.

 ఈ పత్రిక డిజిటల్ గా రూపొందిన నెల వారి పత్రిక. సాహిత్య, కళా రంగానికి
మరియు, సేవా కార్యక్రమాల గురించి వివిధ అంశాలతో కూడిన డిజిటల్ పత్రిక.