డాక్టర్ జల్ది విద్యాధర్ గారి “తోటమాలి మాలిమి” కవితా సంపుటి పై సమీక్ష వ్యాసం
శీర్షిక : మాలిమితో సుగంధ కవితా పుష్పాలు విరగబూ
యించారు
వేమూరి కమలాకర్ సుజాత
కవిత్వం అనేది నిగూడతను కలిగి ఉండి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింప చేసి ఆలోచింప చేసే రచనా రూపం. ఇది ఓ సృజనాత్మక సాహితీ ప్రక్రియ అక్షర హింసకు ఒడిగొట్టకుండా నిరంతర సాధనతో కవిత్వానికి
మెరుగులు దిద్దుకోవచ్చును.
అని చెప్పవచ్చు కవిత్వం ఒక గొప్ప ప్రక్రియ రూపం దీని రహస్యం కవిత్వంలోని మాధూ
ర్యం కవితా ప్రియులకే తెలుస్తుంది.ప్రతిభ వల్ల, అభ్యాసం వల్ల,పరిసరాల అధ్యాయనం వల్ల,పఠనం వల్ల లభిస్తుంది.పాత క్రొత్త కవితల పుస్తకాల పఠనాలతో కవిత్వం మాధూర్యాల ఆకళింపు
లతో కవికి సరిక్రొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి సరిక్రొత్త ప్రక్రియలకు దారితీయిస్తాయి.
కవికి కవిత్వం రాయా
లంటే స్పందించే హృదయం ఉంటే చక్కని భావాలను అందించడమే కవిత్వం. సమాజంలో జరిగే సంఘటనలు ప్రకృతి పై మమకారం, దేశభక్తి దైవభక్తి,కుటుంబ
మానవ సంబంధాలు, స్వీయ అనుభవాలు అన్నీ కవితా వస్తువులౌతాయి.కవి స్పందించే స్పందనకు అనుగుణంగా చక్కని పద
బంధాలతో భావాలను అల్లడంలో కవి గొప్పతనం సుస్పష్టం అవుతుంది. మనసులో
చెలరేగే భావాలభారాన్ని
దాచుకోకుండా భావవ్యక్తీ
కరణను కవిత రూపంలో వెలడించి తన మనసు
లో భారాన్ని దించుకో
వడం సాహిత్య ప్రసవ ప్రక్రియగా పేర్కొన
వచ్చును. నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపి సమాజాన్ని ఆదర్శవంతమైన సమాజంగా కవి తీర్చిదిద్దవచ్చు.
అందరిలో కవిత్వం
దాగుండినా ఏ కొందరిలో నో కవిత్వం బయట పడుతూ అడపాదడపా చిన్నా చితకా కవితలంటూ చెప్పుతూ కవిగా కనబడి మధ్యలోనే ఆగిపోతుంటాడు.మరి కొందరు నిత్య సాధకులై
కవిగా నిలబడుతారు.
కవిగా ఎదిగేందుకు సమయం,
సందర్భానుసారాలు, ప్రభావాలు శ్రేయోభిలాషులైన కన్నతల్లితండ్రులు,గురువులు ప్రోత్సాహంతో ఎదుగు
తున్న కొలది స్నేహితులు,తాను చది
విన పుస్తకాలు,పరిసరాలు ప్రభావాలునిత్యం జపించి తన మదిలోని భావ తరం
గాలను అందమైన
కవితా మాలికలను అల్ల
డంలో నిష్ణాతులైన్నారు.
అదే కోవకు చెందినవారు
కవి శ్రేష్ఠులు డాక్టర్ జల్ది విద్యాధర్ గారు. వారి ఉన్నతమైన భావాలను కవితాత్మకంగా సాహితీ సృజనతో,చమత్కా
రంగా, అలంకార ప్రాయంగా, కొన్నింటిని
కాల్పనికంగా,మరికొన్ని మార్మికతతో,ఇంకొన్నింటిని సూటీగా స్పష్టంగా తమ కవితా భావ లహ
రిని “తోటమాలి
మాలిమి”
కవితల్లో తన కలంతో కదిలించి లిఖించారు.
మెరుగైన సమాజం నిర్మాణంకి ఇవి ఎంతగాన్నో తోడ్పడుతాయి.
“తోటమాలి మాలిమి”
75 కవితల సంకలనం పుస్తకాన్ని 2023 సంవత్సరంలో వెలువరించారు .ఇందులో 184 పేజీలతో నిండినది
పుస్తకాన్ని చూడగానే అందంగా ఆకట్టుకునేలా అర్థవంతమైన ముఖ
చిత్రాన్ని అందించిన
డిజైనర్ శ్రీ బ్రహ్మం గారి, అందంగా ముద్రించిన కర్షక్ ఆర్ట్ ప్రింట్ నిపుణత అగుపడుతుంది.
వెల రూ 200
1-34 పేజీల వరకు కవి పరిచయం, ముందు మాటలను అందించిన ప్రముఖ సాహితీ స్రష్టలు విషయాంశాలు,రచయిత కృతజ్ఞతలును తెలిపే వివరాలు,32-34 పేజీల
వరకు కవితాక్రమం 35 నుంచి 184 పేజీల వరకు చక్కని శీర్షికలతో నిండిన వారి కలం నుండి జాలువారిన అమృతధార కవితలు పొందుపరచబడి తొలి లోపలి అట్టపై రచయిత డాక్టర్ జెల్ది విద్యాధర్ గారి అందమైన కుటుంబ సభ్యుల ఫొటోతో చివరి అట్ట లోపల తమ ఆత్మ
బంధువులతో నిండిన ఫోటోతో పుస్తకం వెనుక వైపు జెల్ది విద్యాధర్ గారి పుస్తక సంకలనం పేరు పుస్తకంలోని తొలి కవితైన “తోటమాలి మాలిమి” కవితను అచ్చు వేయబడి ఉంది
ఈ పుస్తకం గురించి ప్రముఖ పద్మశ్రీ అవార్డు, మూర్తీదేవి పురస్కార గ్రహీత సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు భారతి స్వీకర్త ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, సుప్రసిద్ధ కవి విమర్శకులు అధ్యక్షులు కళారత్న బిక్కి కృష్ణగారు,ప్రఖ్యాత రచయిత్రి,కవయిత్రి,విమర్శకురాలు,తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీతలు ముగ్గురు సాహితీ శ్రేష్ఠుల ప్రముఖులు తోటమాలి మాలిమి పుస్తకం పై ముందు మాటలను ఇచ్చారు.
ఈ త్రిమూర్తులు సాహితీ శ్రేష్ఠుల ముందు మాట
లను చదివితే చాలు కవి హృదయం,కవితల
తత్వం పాఠకులకు
అవగతమౌతుంది.
ముందుగా ముందు మాటలను అందించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఈ కావ్యం “ప్రేమామృతం”గా కొని
యాడారు.కవి తోట మాలి..తోట పంట అమృతం కవి పని అమృతం పంచడం ప్రేమమయమైన అమృ
తాన్ని పంచారు కాబట్టే ఈ పుస్తకం ప్రేమామృతం సమానంగా సెలవిస్తూ రెండు విధాలైన ప్రేమ, స్త్రీ పట్ల పురుషుడి ప్రేమ ప్రకృతి పురుషుల ప్రేమ ప్రపంచానికి ఇంధనం ప్రేమ, స్త్రీ పురుష ప్రేమ మానవ అస్తిత్వానికి అర్థం మానవజాతి భవిష్యత్తుకు వ్యాఖ్యానం రెండో కోణం సమాజం సమాజ అస్తిత్వానికి సమతా భావం కవి ఇచ్చే సందేశం అని సెలవిస్తూ రచయిత కొన్ని కవితలలోని కొన్ని విశేష
పాదాలను తీసుకొని చక్కని విశ్లేషణ పూర్వకంగా తొలిపలుకులను అందిం
చారు.అదేవిధంగా కళా
రత్న బిక్కి కృష్ణ గారు జెల్ది విధ్యాధర్ గారి కవితా సంపుటి గురించి వ్యాఖ్యానిస్తూ “కవిత్వాన్ని వర్షించే కారుణ్య మేఘం!”
“విద్యాధర్..కోమల హృదయం” అని ఉటంకించగా ప్రముఖ సాహితీ వేత్త శ్రీమతి శైలజా మిత్ర గారు “విశ్వజనీనమైన భావ బలిమి” అని తోటమాలి మాలిమి పుస్తకం గురించి తేలియచేసారు
ప్రేమామృతాన్ని నిండిన వీరి ” తోటమాలి మాలిమి”అనే కవితా రచయిత గురించి చెప్పాలంటే డాక్టర్ జల్ది విద్యాధర్ గారు వృత్తి రీత్యా
ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నతాధికారిప్రవృత్తి రీత్యా కవి,రచయిత వారి తల్లిగారి పేరిట విమలా సాహితీ సమితి, ఈ పత్రిక వ్యవస్థాపకులు వీరు.
సాహితీ సేవా కార్యక్రమాల నిర్వాహకులుగా కవి సమ్మేళనాలను, పుస్తకావిష్కరణలు,కవిత్వ పోటీలు, విభిన్న సాహిత్య అంశాల పై సదస్సులు, సాహితీ దిగ్గజాల పై రచనలపై సమీక్షా సమావేశాలును
జరుపుతూ వర్థమాన కవులను ప్రోత్సహిస్తూ సాహితీ సేవలందిస్తున్నారు.
గుంటూరు జిల్లా గురజాల వాస్తవ్యులు. ఉన్నత విద్యా ,వృత్తి విధులను నిర్వర్తించిన కీర్తి శేషులు జెల్ది విమలా దేవి,దేవదానం గార్లకి నాలుగురు సంతానంలో కనిష్ఠ పుత్రుడిగా వెలుగొందిన వీరి విద్యాభ్యాసం హైస్కూల్, ఇంటర్ డిగ్రీ గుంటూరు జిల్లాలో పూర్తి చేసుకొని మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఏ పూర్తి చేసుకొని సుప్రసిద్ధ కంచి కామకోటి శంకర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పరిశోధన చేసి పి.హెచ్ డి డాక్టరెట్ పట్టాను పొందారు.జూనియర్ కళాశాల స్థాయి నుంచే కవితలు వ్రాసే అభిరుచిని కలిగి ఓ మాతా భారతీ…చెలి చెలి నా మదిలో చక్కలి
గిలీ కాలేజీ మ్యాగజైన్
లో సంచలనం రేకెత్తిం
చిన కవి.ఇంటర్ స్థాయి
లోనే శ్రీశ్రీ మహాప్రస్థానం
తిలక్ అమృతం కురిసిన రాత్రి పుస్తకాలను చదివి ఆకళింపు చేసుకొని
గుండెలకు హత్తుకొన్న
సాహితీ ప్రియులు. విద్యార్థి దశ నుంచే నాయకత్వం లక్షణాలను పుణికి పుచ్చుకుని, సాహితీ రంగం ప్రవేశకులై జీవితంలో ప్రతి దశలోను సాహితీ రంగంలో ప్రముఖులతోను,సాహిత్యంతో
మెలిగిన విద్యాధర్ అనే పేరులోనే విద్యను ధరించిన వారైన వీరు విద్యా సరస్వతీ పుత్రులై సమాజం పట్ల అవగాహన కలిగి జరుగుతున్న పరిస్థితులకు స్పందిస్తూ బాధ్యతాయుత పదవిలోనున్న,అటూ వృత్తి ఇటు ప్రవృత్తి ధర్మాన్ని అనుసరిస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి తన వంతూ సాహితీ రచనలు, సేవలు అందిస్తున్న నిర్మల సహృదయులని వారి సేవా తాత్పర్యతను చూస్తే తెలుస్తుంది.
సున్నితమైన భావాలను కాల్పనిక భావాత్మక రూపంలో రూపక సమాస,అలంకారపదాల
తోను,అంత్యాను ప్రాస పద ప్రయోగాలుతో
పదాలను
సుందరనందనంలో కవితా తోటలో క్రొత్త పూల పరిమళాలు వెదజల్లి పూమొగ్గల తొడుగులను తొడిగారు అని ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు కితాబు ఇచ్చారు.
కవితాను పతాక స్థాయికి చేర్చేది శీర్షిక ముఖ్యం.అటువంటి సృజనను తమ సొంతం చేసుకున్న కవి శ్రీ జల్ది విద్యాధర్ గారు తమ 75 కవితలుకు పెట్టిన శీర్షికలుతో ప్రతి కవితను పాఠకుల్ని ఆసాంతం చదవాలన్న ఉత్సుకతతో కట్టిపడేసారు. ఉదా: 1.తోటమాలి మాలిమి
4.నన్నేం చేస్తావో నీవే చెప్పు!!
5.”దీపపు పురుగులు”
6.కనులుమాటలాడుననీ
11.”ఇచ్చుటలో ఉన్న హాయి”…!
12.”నా పరివేదనే నీకు నివేదన”
22.”గబ్బిలమా నన్ను వదిలిపో”
28.”లోకబాంధవుడు లోయలో పడ్డాడు”
44.”ఉరేసుకొన్న ఊసరవెల్లి”
55.”గుండెను గుచ్చినట్టే ఉంటుంది!”
64.”ఏం మార్చగలవ్!ఏమార్చగలవ్”!!
66.”పంటను మేసిన కంచేలు”
67.అద్దంలో జాబిలి!
68.”కప్పల్లారా అరవండి”
72.సమసమాజ
స్వాప్నికులం!!77.జగజ్జేత ఇతడే!!
మచ్చుకు మాత్రమే ఇక్కడ కవితా శీర్షిక
లుతో కూడిన అంశా
లను పొందు పర్చబడం చేయడం అయింది.
వీటిని చూడటంతో
పాఠకులకు రచయిత డాక్టర్ జెల్ది విద్యాధర్ గారు ఎంతటి సాహితీ జ్జానులో అర్థమౌతుంది.
వారి కవితా సంకలనం
లోని పతాక స్థాయిలో నిలిచిన తొలి కవితాను “తోటమాలి మాలిమి” శీర్షికనే పేరుగా రంగరించి పుస్తకానికి వన్నె
తెచ్చారు.
భావావేశాలను కవితా ఝరులు కురిపించి మురిపించిన రసమయ కవి హృదయులు డాక్టర్ శ్రీ జల్ది విద్యాధర్ గారు
తొలి కవితలో కొన్ని పాదాల అరవిందాలను చవిచూపించారు.
1.”తోటమాలి మాలిమి” కవితలోని అపురూప పదాల వాక్యాలును పరిశీలనగా చదివితే ఎంతటి మార్మిక ధార్మి
కత ప్రేమామృతం,
సమతా భావం తొణికి
సలాడుతుంది.
నాలుగు భాగాల కల ఈ కవిత్వంలో ప్రతి భాగం లోను భావుకత చమక్కులు పువ్వుల పరిమళాలు వెదజల్లు
తాయి.
పరిమళాలు ఊరికే వస్తాయా/
పరవశాలు లోలోపల పగలకుండా/
అసలు ప్రపంచమే ఒక పెద్ద పూలతోట/
తన్మయంతో తేలుతున్న పూల సముద్రం/
పువుల్లాంటి మనుష
లను తలపై మోసుకు తిరగండి/
మాసిపోని సుగంధం ఒంటికి అంటుతుందేమో/
అతుక్కున్న చెమట వాసన చెదిరి పోతుం
దేమో/
తోటమాలి పనుంటే చెప్పండి ఎక్కడున్నా పోతాను /
జీతం భత్యం భత్యం ఏమీ లేకుండా కాయ
కష్టం చేస్తాను/
తిరిగి తల ఎత్తకుండా అపార్థాల కలుపు తీస్తాను /
అనర్థాల కీటకాలు తొడిమలను తెంప
కుండా చేస్తాను/ కాయకష్టం చేస్తాను
దించిన చేతులు లేప
కుండా కూరిమి ఎరు
వును వేస్తాను/
మనసులను కొన్ని కలిపి దండలో దారంలా ముడిచి వేస్తాను/
గంపలతో వారి మంచి తనాన్ని బంతి పూలలా మోస్తాను/
మదిలోని కసువంతా ఊడ్చి మడులను శుభ్రం చేస్తాను /
వాడిన పూల
సౌరభాలను ఊరు ఊరంతా చల్లుతాను/
ఇలా ఇరవై ఎనిమిది పాదాలతో నిండిన ప్రేమామృత మానవీయత సౌగంధాల ధారతో కవి హృద
యాల్ని తాకించి తన్మయం కావించారు
మనుషులంతా తోటలోని స్వచ్చమైన పువ్వులు వంటివారని అపార్థాల కలుపులతో అనర్థాల కీటకాలతో చిన్నాభిన్నం అవుతున్నారని కవి తోటమాలిగ ప్రేమను పంచుతూ చీడలను,
కలుపులను తొలగిస్తా
ననడంలో ఎంతటి ఔదార్యం,సౌకుమార్యంతో అలతి అలతి రూపక సమాస,ఉపమాన
పదాలతో పాఠకుల్ని మంత్ర
ముగ్దుల్ని చేసి అలరించి ఆలోచింప చేయడంలో ఆధ్యులు అనడంలోఏవి
ధమైన సందేహం లేదు. ఇలాగే ప్రతి కవిత లోను విభిన్న అంశాలను హృదయంతో స్పృశించి గాయాలకు లేపనాలుగా
సమస్యలకు పరిష్కార మార్గాలుగా చితికిన హృదయాలకు అమృత ఝరులు తాకిడిలతో నవ చైతన్యాన్ని తట్టి లేపే కాంతిని విశ్వ శ్రేయోదాయకం కాంక్షను వారి కవితల్లో కనిపిస్తుంది.
అలాగే కొన్ని కవితల్లోని కవితా పంక్తుల్ని
దిగువున చూసినప్పుడు
ఆ కవితలో భాషా
నైపుణ్యం చతురత
సౌకుమార్యం,ఆర్తి,రసరమ్యత అణువణువునా కన
బడి హృదయాల్ని కది
లిస్తుంది.
4.”నన్నేం చేస్తావో నీవే చెప్పు”!!
ఈ కవితలో అద్భుతమైన కవితా పాదాలతో నిండిన కవితా శిల్పీకరించడంలో
దిట్టగా నిలిచిన్నారని ఈ క్రింది విభాగం కన్న దాని పై నున్న రెండు విభాగా
ల్లో వారి కవితా పటిమ కనబరిచారు.
ఈ కవిత మార్మికతతో నిండిన కవిత
ఏడు విభాగాలుగా వ్రాసిన వచన కవితలో
మూడవ విభాగాన్ని పరిశీలిస్తే తన ప్రేయసి గొప్పతనాన్ని చెబుతూ
నేను మేలుచెక్కతో చేసిన గుర్రపుబగ్గీ లాంటి వాడిని /
ఎన్ని మెరుగులు దిద్దినా నీవు లేకుంటే ఒట్టి
సున్నానే/
ఎక్కడేసిన బండి అక్కడే ఆ మూలనే పడి ఉంటుంది/
నీ ఆత్మీయస్పర్శే లేకుంటే చెదలుపట్టి పొట్టు రాల్తుంది/
నీవు శక్తియుక్తులు కలిగిన అరేబియన్ అశ్వరాజసానివి /
ముందు నీవుంటేనే నా నడకైనా పరుగులైనా ఉరుకులైనా/
పై పాదాలను చదువు
తుంటే వారి కవితా నిర్మాణం శైలిలో జిగి బిగి అల్లికలు పదబంధాల సొగసులు,వస్తువైవిద్యం,భావ వైరుధ్యం,భాషా సౌందర్యం,నిపుణత తొణికిసలాడుతుంది .
ఏడవ భాగంలో
నన్నేం చేస్తావో నీవే చెప్పు/ నీ అనురాగ లోయలో తోసేస్తావా/
నీ రాణి వాసపు కోటగు
మ్మానికి జన్మఖైదీలా వేలాడదీస్తావా/
నీ రాజప్రసాదపు బురుజుపైన పొగరు జెండాలా ఎగరేస్తావా/
అలంకార ప్రాయంగా, చమత్కారంగా తీర్చి
దిద్దుతూ ప్రేయసిని నీవు నన్ను ఏమి చేస్తానో నీవే చెప్పు ప్రశ్నించే తీరులోనే అమాయ
కత్వం,వాపోయిన విధానం,నిండైన ప్రేమ దాగుంది.
ఇందులో కవి రచనా సంవిధానం, హృదయ గత భావోద్వేగాలు ధారను ఎంత రమణీయంగా ఒలికించగలరో
పై కవితా పాదాలను చదివితే ఏ కవితా ప్రియులైన తన్మయం పొందాల్సిందే
అలాగే
5.దీపపు పురుగులు!!
కవితలో
ఏడు విభాగాలుగా వచన కవితలో ఈ క్రింది పద పంక్తులను చదివితే
వారి కవిత్వంలో ఏమి దాగున్నాయో కవి
సుస్పష్టంగా సెలవిచ్చారు
రెండవ విభాగంలో భావపంక్తులు కవి కవిత్వం గురించి పాఠకులకు అవలోకనం చేసుకొంటున్నారు.
నా భావాలలో నా కవి
త్వాన్ని సున్నితంగా చూడూ/
నేను వేరు నా కవిత్వం వేరేమీ కానే కాదని చెబుతాను/
రెండూ ఒకే ఊయలలో
ఊగుతున్న అవిభక్త కవలలు /
నిద్దురలో ఆభ్యుదయాన్ని పలవరించే పసిపాపలు/
అలాగే వారి కవితాంశంలో ఏ ఏ వస్తు
అంశాలు చేరి ఉంటాయో కూడా విడమరచి చెప్పారు ఆ విషయం దిగువ పంక్తులును చదివితే పాఠకలోకానికి
అవగతం అవుతుంది.
నా కవిత్వంలో సకల జనులూ కొలువు తీరి ఉన్నారు/
ఆర్టీసి కార్మికుల కాకులు గొంతులు చిరిగేలా అరుస్తున్నారు/
కరోనా బాధిత పాద
యాత్రికులు చీమల్లా బారులు తీరారు/
వారి ఆకలి ఆర్తధ్వనులు
నా అక్షరాల్లో ప్రతిద్వని
స్తుంటాయి/
దీనీని బట్టి కవి ప్రేయసి ప్రియులు ఊహా కాల్పనిక కవితలే కాదు ఎందరో దీనులు వేదనలు, విభిన్న సమ
స్యలతో సతమౌతున్న జనుల గోడుల వాస్త
వలను గురించి కవి
త్వీకరిస్తున్నారని ఇంకా కవి ఎటువంటి వారి గురించి తన కవితలో భాగాంశాలుగా ఉంటా
యో తెలుసుకోవాలంటే
పాఠకులు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిందే
11.”ఇచ్చుటలో ఉన్న హాయి” ..!
అనే కవితలో మూడవ,నాల్గవ భాగంలోని కవితా పాదములను పరిశీలించినట్లైతే కవి మానవీయ దయ కరుణ రసం ప్రస్పుటంగా కనిపిస్తుంది
గుర్తుపెట్టుకో మిత్రమా నీకున్నది ఒక్కటే ఒక ప్రశస్త జీవితం/
ఉన్నప్పుడు
ఉత్తమోత్తమైనది మాత్రమే ఇస్తూనే ఉండు /
పుచ్చినదో నచ్చనిదో
ఏతాలుసరుకో ఇద్దామను
కోవద్దు/
ఇస్తూనే ఉండు జేబులో గలగలలు మోగుతుండే వరకూ /
వందలో రెండో మూడో ఇస్తే దివాలా ఏమీ తీయలేవు కదా/
ఉన్నప్పుడేగా ఇచ్చేదీ మనమున్నప్పుడే కదా ఎవరైనా వచ్చేదీ/
లేకుండాచూసీ ఎవరూ
రారు లేనోడంటే కాస్త కనికరం చూపు /
ఇలా వాస్తవిక సత్యా
లను,సున్నితమైన భావాలను సరళమైన భాషలో సూటీగా స్పష్టంగా తెలుపడంలో వారికి వారే సాటి అని చెప్పకుండా ఉండలేము.
ముగింపు: డాక్టర్ జల్ది విద్యాధర్ గారి తోటమాలి మాలిమి కవితా సంకలనంలోని కవితలనన్నిటిని ఎక్కడా ఆపకూండా చదివించగలిగే శక్తిని నింపుకున్న పుస్తకం ఇది కవితా శీర్షికలు ఎంపికల నిపుణతను రంగరించి చక్కని చిక్కని భావజాలంతో,
సుతిమెత్తని చరుపులతో,
పొందికైన పదజాలాలతో,
చమత్కారలతో, చమక్కులుతో,
విభిన్న పోకడలను
మార్మిక, కాల్పనిక, అభ్యుదయ భావాల
సౌందర్య కవితా లహిరిల్లో పాఠకుల హృదయాలను రసానందడోలికలను ఊగించారు.
ప్రతి కవితలోను తన హృదయాంతరాగాలతో కవితా భావాలను రాగించి క్రమానుసారంగా రంగరించి పాఠకుల పఠనాశక్తిని పెంపొం
దించేలా కూర్చారు. కవిత్వ-కళ,కవిత్వ నిర్మాణ పద్ధతుల పాత్ర అద్భుతంగా, సుతి
మెత్తగా ఆవిష్కరించారు ప్రతి కవితా రచనలో ఇంపైన పదజాలాలను,
అలంకార ప్రాయంగా రూపకాలంకార వాక్య ప్రయోగాల సందడులు
భాషా నైపుణ్యం, సమా
జిక స్పృహ, స్వార్థం దురహంకారల పోకడ
లతో ముడి చిక్కుము
డులను విప్పడంలోను, మానవీయ కోణాలను
నేర్పు ఓర్పు,అస్పష్టతకు తావి వకుండా మార్మి
కతతో నిండిన విషయాల్ని విడమర్చి పాఠకుని హృదయాల్లో చొప్పించే సాహితీ సౌష్ట్యం నిండిన రచన ప్రతిభ వారిది.ఆ ప్రతిభ తోటమాలి మాలిమి పుస్తకంలోని తోటలోని ప్రతి కవితల్లోను సుగంధ పరిమళాలు విరాజిల్లటం చేత పుస్తకాన్ని ఆద్యంతం ఆపకుండా చదివి ఆ మధుర సువాసనల పరిమళాలను తాము అద్దుకొని మురియాలన్న తపన శక్తి ఇందులో దాగుంది అని చెప్పటంలో అతిశయోక్తి ఏమి కాదని చెప్పవచ్చు.
.తోటమాలి మాలిమి పుస్తకంలోని కవితలన్ని చదివాక పాఠకులకు వాటిపై ఒక సమగ్రమైన అవగాహన ఏర్పడుతుంది.ఎందరో కవులకు దిక్సూచిగా ఇది నిలబడుతుంది.నిగూడంగా ఉన్న విషయాలను సామాన్యులకు కూడా విప్పి చెప్పేది వీరి పుస్తకం.సమాజంలో వస్తున్న వాస్తవిక మార్పులను వారి రచనా చిత్త శుద్ధి,నిమగ్నత ఇందులో అణువణువునా తొణికిసలాడుతుంది వీరి తోటమాలి మాలిమి పుస్తకం పాఠకుల గ్రంథాలయంలోనూ పబ్లిక్ గ్రంథాలయం
లోనూ ఉంచదగిన పుస్తకం.వర్థమాన కవులకు,భావాలను కవిత్వంగా చేయడానికి ఇబ్బంది పడేవారికి ఒక మార్గ దర్శనంగా నిలబడే పుస్తకం ఇది రాసేటప్పుడు కలిగే సందేహాలకు సమాధాన రూపం తెలుగు సాహిత్యంలోని ఉత్తమ గ్రంథాలలో నిలిచిపోయే రచనా కవిత్వానికి తార్కాణ రూపం.డాక్టర్ జల్ది విద్యాధర్ గారి తోటమాలి మాలిమితో సుగంధ కవితా పుష్పాలను విరగబూయించారు.
డాక్టర్ జల్ది విద్యాధర్ గారు మునుముందు ఇలాంటి సందేశాత్మక కవితా సంపుటిలను వెలువరించి సాహితీ ప్రియులను అలరిం
చాలని ఆకాంక్షిస్తూ..
వేమూరి కమలాకర్ సుజాత తెలుగు స్కూల్ అసిస్టెంట్ టీచర్
రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా