తెలుగు సంప్రదాయాలు.. కుటుంబ సంబంధాలు
———————————‐——-‐-‐–‐
జాతి ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచేవి సంస్కృతి సంప్రదాయాలు తరాల వారధిగా నిలిచేవి. ఒక దేశం యొక్కభాష,కళలు,సంప్రదాయాలు,సాహిత్యం, మతము, ధర్మ నీతులు ,నాగరికత, అలవాట్లు కట్టుబాట్లు ఇత్యాది అంశాలు సంస్కృతిలో ఇమిడిఉంటాయి.
సంస్కృతిలో భాగమైనది సంప్రదాయం. ఈ పదానికి అర్థం ‘బాగ అందించడం ‘. సం అంటే ‘ ‘సంపూర్ణంగా’ ప్ర అంటే ‘ప్రభావవంతంగా’ దాయ అనగా ‘ఇవ్వడం’ మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకు అందించడము.
భాషా,మత,కుల, దేశ పరంగా ప్రత్యేక సంప్రదాయాలనేవి ఉంటుంటాయి. అవి ఆ జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ, జాతి పురోభివృద్దికి,పటిష్టతకు పాటుపడుతాయి.
తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేక సంప్రదాయాలు ఇమిడున్నాయి.కట్టు,
బొట్టు, పండుగలు,
ఆహారపు అలవాట్లు పెళ్లిళ్లు, పుట్టిన రోజులు అనేక సామాజిక అంశాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.
మన తెలుగు వారి సంప్రదాయాలు చక్కని సినీగేయాలలోను,జానపద
గేయాల్లో,ఆట పాటలు,సినిమాల్లో, నాటకాల్లో పండగపాటలోను
,తెలుగువారి భావాల పరంపర నిజవైఖరులు, సామాజిక అంశాలు
అనుబంధాలు,అనురాగాల,సంస్కారం,పెద్దల పట్ల వినమ్రత ఉంటుందనడంలో అతిశయోక్తి ఏమి దాగిలేదు.
పాడనా తెలుగు పాట అంటూ అనే పాటలో తెలుగు పడతి ఆహార్యం ప్రస్ఫుటిస్తుంది. అలాగే సినారే గారు వ్రాసిన తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగు వారి సంస్కారాన్ని,సౌభ్రాతృత్వాన్ని,భాషను చక్కగా అక్షరీకరించారు.
అలాగే వివాహభోజనంబు వింతైన వంటకంబు అనే పాటలో వివాహాలు వంటకాలు,రుచులు బంధాలను ఉటంకించడం
అలాగే ఎన్నో ( ఉగాది, సంక్రాంతి,దసరా,దీపావళి,) ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలు
,దృక్పథంలోను పండుగలోను నృత్యం,నోములు,వ్రతాలు,
పంటలు,వృత్తులలోను,
సాహిత్యంలోను అణువనువున తెలుగుతనం ఉట్టి పడుతుంది. తెలుగు వారి సంప్రదాయాలు శాస్త్రీయమైన,హేతుబద్ధతతో కూడిన ప్రత్యేకమైన విశిష్ట ప్రాధాన్యం గలవి.
ప్రపంచీకరణ, సాంకేతీకరణంతో అనేక అనూహ్య మార్పులుతో పల్లె పట్నం పక్షులౌతున్నారు. జానపదాలు,ఆట,పాట, వేషాలు చతికిలపడిపోయాయి. శతక పద్యాలు
,కృతులు, కీర్తనలు పదసంపదలులోను మన సంప్రదాయాలు చిహ్నలు అగుపడతాయి. ఇవి అన్ని మన తెలుగు జాతి సంపదలు.తరాలు మారిన తరాలకు వారధిగా నిలుస్తాయి.. మధ్య తరగతి తెలుగు ప్రజలుతో సంప్రదాయాలు నిలబడి ఉన్నాయి. వేడుకలు,విందులు,వినోదాలు,సంస్కారం,సఖ్యత,
సౌభ్రాతృత్వం కట్టుబాట్లు,విలువలు,ఆహారం,వస్త్రాధరణ,పెద్దలు పట్ల గౌరవం,తోటివారితో పరస్సర సహకారాలతో మిగలడం బంధాలను, అనుబంధాలను కాపాడుకోవడం త్యాగాలు చేయడం ధర్మనిరతిని కలిగుండడం, పంచభూతాలను దైవసమానంగా ఆరాధించడం,భూతదయ కలిగివుండడం,
క్షమా,దానగుణాలు,
ఋతుధర్మం పాటించడం తదితర మహోన్నత అంశాలు తెలుగువారి సంప్రదాయాలలో అంతర్భాగాలు.
సమాజాన్ని పటిష్టపరచి
శతాబ్దాలుగా అందర్ని ఐక్యతగా ఉంచి ఓ శక్తివంతమైన బంధం, సుసంపన్నమైన సామాజిక చిత్ర అవనికను వైవిధ్యంగా అల్లి ఒక సమగ్ర రూపంగా మార్చేదే కుటుంబ వ్యవస్థ. ఇది వ్యవస్థ కాదు ఒక సంస్థ..ప్రాచీన కాలం నుంచీ నేటి వరకు మన సమిష్టి సంస్కృతికి ఒక విశిష్ట ప్రతీక మన కుటుంబం.
సంప్రదాయంలో అంతర్భాగమైనది వివాహబంధం. వివాహ బంధంతో కుటుంబ వ్యవస్థకు పునాది పడి సమాజ వికాసానికి తోడ్పడి శాంతియుత వాతావరణానికి దోహదకారిగా నిలుపేలా చేస్తాయి మన తెలుగు సంప్రదాయాలు.
కుటుంబం కుటుంబ సంబంధీకులు
మధ్య బలమైనబంధాన్ని ఏర్పర్చి పెద్దలు అవసరాలను తీర్చడం ఒకరిపై ఒకరు శ్రద్ద వహించడం
,సురక్షితమైన రక్షణ నిచ్చేదై అవగాహన ఏర్పాటు ఇతరుల అభిప్రాయాలను అంగీకరించడం,
భాష తీయందనాలను
అనుకరించడం ఆధ్యాత్మికం,ఇతిహాసాలు పై స్త్రీని గౌరవించడం, తల్లి తండ్రుల్ని దైవసమానులుగా, గురువును త్రికరణ దైవ స్వరూపులుగా
చూడటం,అన్న తమ్ములు,అక్కచెల్లెండ్లు
అత్త మామ బంధాల్ని ,ఓపిక,
సమైక్యత అనే బలమైనభావనలను
మనసులో నాటుకునేలా చేస్తుంది. వ్యక్తి సమగ్రతను,వ్యక్తిత్వం
పెంపుదలకు ప్రజాస్వామ్య వైఖరిని వంటి లక్షణాలను తరతరాలుగా మనం చూస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు,జీవనశైలి కుటుంబ వ్యవస్థ నుంచే వస్తాయి.సామాజిక సామరస్యానికి ప్రజాస్వామ్య ఆలోచన విధానానికి కుటుంబ వ్యవస్థ భీజాలు వేస్తుంది
కుటుంబ విలువలు ముఖ్యమైన పాత్రనుపోషిస్తాయి. మన సంప్రదాయాలలో భాగంగా పెద్దల పట్ల శ్రద్ద,గౌరవం అనేవి ప్రధానంగా కనిపించినా, నేడు అవి ప్రపంచీకరణ పోకడలతో,పాశ్చాత్య అనుకరణ,వైయుక్తిక కుటుంబాలు ఏర్పడడం,,ఆర్థిక పోకడలు కుటుంబ వ్యవస్థ విలువల్ని దిగజారుస్తున్నాయి. ఇంట్లో పెద్దవారు ఎవ్వరూ లేకపోవడంతో నేటి కాలంలో చిన్న పసి పిల్లల్ని క్రేచ్చులల్లో వదిలేసి హడావుడిగా ఉద్యోగాలకు వెళ్లడం కొంచెం పెరగగానే మాట వినరని రెసిడెన్షియల్ వదలేసి వృద్దుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్చే ప్రవృతి పెరుగుతుండడం విషాదకరం.
విలువైన భావనల్ని,ఆచారాలను పదిలపరుచుకొని తరతరాలకు అందీయడం మన ధర్మం. సమస్యకు పరిష్కారం వెదికి పట్టుకోవాలే కాని జాతి అనుభవాల మూలాలనూ కూల్చరాదు.
సమాజంలోసాంస్కృతిక,సమాజిక విలువలను కాపాడి పెంపొందించడంలో ఉమ్మడి కుటుంబాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అనాది నుంచీ మన తాత్విక దృక్పథమైన వసుధైక కుటుంబంలో మానవత్వం,ఆర్దృత,విశాల హృదయం సహనం మొదలైన భావాల స్ఫూర్తితో మనం ప్రపంచాన్ని శాశ్వతంగా మనం జీవించే ఒక అత్యుత్తమ స్వర్గ
ధామంగా మార్చుకోవచ్చు అని అన్నారు ప్రముఖ నాయకులొకరు
దానిని నేటి,రేపటి తరం నిజం చేసి చూపాలి లోకానికి. తెలుగుజాతి ఔన్నత్య వికాసానికి తెలుగు భాషను మాట్లాడుదాం తెలుగు సంప్రదాయాలను కాపాడుదాం.
వేమూరి సుజాత కమలాకర్